ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ – వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పారిశ్రామికవేత్తలు

October 15th, 02:23 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ) - 2024 సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. డబ్ల్యుటిఎస్ఎ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రామాణికీకరణ కార్యకలాపాలకు పాలక వర్గ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ సదస్సును ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో- భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది టెలికాం, డిజిటల్, ఐసిటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 190 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా పారిశ్రామిక నాయకులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చిన ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సు.

ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

November 03rd, 11:08 am

సువర్ణ భూమి, థాయిలాండ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణ జయంతి అంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇది నిజం గా ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆదిత్య బిర్లా గ్రూప్ బృందాని కి నా అభినందనలు. థాయిలాండ్ లో తమ గ్రూప్ చేస్తున్న ప్రశంసనీయమైన పని గురించి శ్రీ కుమార్ మంగళం బిర్లా చెప్పగా మనం ఇప్పుడే విన్నాము. ఇది ఈ దేశం లోని చాలా మంది ప్రజల కు అవకాశాల ను, ఆదాయాన్నీ కల్పిస్తోంది.

థాయిలాండ్ లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూపు స్వ‌ర్ణోత్స‌వాల లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం లోని ముఖ్యాంశాలు

November 03rd, 10:32 am

మ‌నం ఆదిత్య బిర్లా గ్రూపు స్వ‌ర్ణోత్స‌వాల ను జ‌రుపుకోవ‌డం కోసం ఇక్క‌డ థాయిలాండ్ లో భేటీ అయ్యాము.

థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల స్వ‌ర్ణోత్స‌వాలకు హాజరైన ప్ర‌ధాన‌ మంత్రి

November 03rd, 07:51 am

థాయ్‌లాండ్‌ లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల కార్యకలాపాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్యాంకాక్‌లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో తమ సంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రభుత్వాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అనేకమందికి అవకాశాలు కల్పించడంతోపాటు వారి సౌభాగ్యానికి తోడ్పడటంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. బలమైన భారత-థాయ్‌లాండ్‌ సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ- సంస్కృతి, వాణిజ్యాలు ప్రపంచాన్ని సన్నిహితం చేసి, సమైక్యపరచగల సహజ శక్తులని పేర్కొన్నారు.