ఏప్రిల్ 18 నుంచి 20 వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శ‌న

ఏప్రిల్ 18 నుంచి 20 వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శ‌న

April 16th, 02:36 pm

ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మ‌ధ్య‌న ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్ లో పాఠ‌శాల‌ల క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ను సంద‌ర్శిస్తారు. 19వ తేదీ ఉద‌యం 9.40కి బ‌న‌స్కాంత‌లోని దియోద‌ర్ లో సంకుల్ వ‌ద్ద బ‌న‌స్ డెయిరీకి శంకుస్థాప‌న చేసి ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిష‌న‌ల్ మెడిసిన్ కు శంకుస్థాప‌న చేస్తారు. 20వ తేదీ ఉద‌యం 10.30కి గాంధీన‌గ‌ర్ లో గ్లోబ‌ల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సును ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి ద‌హోద్ లో జ‌రుగ‌నున్న ఆదిజాతి మ‌హా స‌మ్మేళ‌న్ లో పాల్గొన‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.