ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నరు భేటీ

November 26th, 05:19 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్‌వ్రత్ ఈ రోజు సమావేశమయ్యారు.

గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..

గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన

October 28th, 03:30 pm

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన గుజరాత్ గవర్నరు

July 01st, 01:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ ఈ రోజు న సమావేశమయ్యారు.