బహమాస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:25 am
బహమాస్ ప్రధాని శ్రీ ఫిలిప్ డేవిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కారికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. ప్రధానమంత్రులు ఇరువురూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.