Art is pro-nature, pro-environment and pro-climate: PM Modi
December 08th, 06:00 pm
PM Modi inaugurated the first Indian Art, Architecture & Design Biennale (IAADB) 2023 being held at Red Fort. During the programme, the Prime Minister inaugurated the ‘Aatmanirbhar Bharat Centre for Design’ at Red Fort and the student Biennale- Samunnati. He also launched a Commemorative Stamp. PM Modi also took a walkthrough of the exhibition showcased on the occasion.ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు-2023కు ఎర్రకోట వద్ద ప్రధాని ప్రారంభోత్సవం
December 08th, 05:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.ఒకటో ఇండియన్ఆర్ట్, ఆర్కిటెక్చర్ & డిజైన్ బియెన్నేల్ 2023 ను డిసెంబరు 8 వ తేదీ నాడుప్రారంభించనున్న ప్రధాన మంత్రి
December 07th, 02:13 pm
ఒకటో ఇండియన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఎండ్ డిజైన్ బియెన్నేల్ (ఐఎఎడిబి) 2023 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 8 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4 గంటల వేళ కు ఎర్ర కోట లో ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఎర్ర కోట లో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫార్ డిజైన్ ను మరియు ‘సమున్నతి’ పేరు తో ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించేటటువంటి విద్యార్థి బియెన్నేల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.