ఆరంభ్ 6.0 సందర్భంగా యువ సివిల్ సర్వీసు ఉద్యోగులతో ప్రధానమంత్రి ముఖాముఖి
October 30th, 09:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరంభ్ 6.0 కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీసు ఉద్యోగులతో సంభాషించారు. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో పరిపాలనను మెరుగుపరచడంపై యువ ప్రభుత్వోద్యోగులతో ప్రధాని విస్తృతంగా చర్చించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు బలమైన యంత్రాంగాలను కలిగి ఉండటం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మెరుగుపరచడం వంటి అంశాల ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పౌరులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభతర జీవనం)'ను మెరుగుపర్చాలని యువ ప్రభుత్వోద్యోగులను ప్రధాని కోరారు.అక్టోబరు 30, 31 లలో ప్రధాన మంత్రి గుజరాత్ పర్యటన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో ప్రధాన మంత్రి
October 29th, 03:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30, 31 తేదీలలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అక్టోబరు 30న సాయంత్రం సుమారు 5:30 గంటలకు ప్రధాని కేవడియాలోని ఏక్తా నగర్ కు వెళ్తారు. రూ.280 కోట్లకు పైగా విలువైన అనేక మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలలో పాలుపంచుకొంటారు. సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఆయన, ‘ఆరంభ్ 6.0’ లో భాగంగా ఉన్న 99వ కామన్ ఫౌండేషన్ కోర్సు తాలూకు శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్టోబరు 31న ఉదయం 7:15గంటలకు ప్రధాని ఏక్తా విగ్రహం వద్దకు చేరుకొని, పుష్పాంజలి సమర్పిస్తారు. ఆ తరువాత, ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో పాల్గొంటారు.