ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 29th, 02:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు గుజరాత్, రాజస్థాన్‌లలో పర్యటించనున్న ప్రధానమంత్రి.
October 29th, 08:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గుజరాత్, రాజస్థాన్ లలో 2022 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు పర్యటిస్తారు. అక్టోబర్ 30న ప్రధానమంత్రి వడోదరలో సి`295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్‌కుశంకుస్థాపన చేస్తారు.ఆరంభ్-2020 సందర్భంగా సివిల్ సర్వీస్ ప్రొబెషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ పూర్తిపాఠం
October 31st, 12:01 pm
మిత్రులారా, ఏడాదిక్రితం ఉన్న పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. సంకట సమయంలో దేశం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టింది? దేశ వ్యవస్థ ఏ విధమైన పనులు చేసింది? అనే విషయాలనుంచి చాలా నేర్చుకుంటారనే విశ్వాసం నాకుంది. మీరు కేవలం చూడటం మాత్రమే కాదు. అనుభవం ద్వారా నేర్చుకుని ఉంటారని భావిస్తున్నాను. కరోనాతో పోరాటం సందర్భంగా భారతదేశం చాలా అంశాల్లో ఇతరులపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంకల్పంతో ఏదైనా సిద్ధిస్తుంది అనడానికి ఇదోక మంచి ఉదాహరణ.ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కోర్సు “ఆరంభ్” రెండో దశలో భాగంగా, శిక్షణలో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులతో మాట్లాడిన ప్రధాని
October 31st, 12:00 pm
సవిల్ సర్వీసులకు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్న అధికారులతో , గుజరాత్‌లోని కేవాడియా నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కోర్సు ఆరంభ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.