రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ కుపెద్ద దన్ను: 2025-26 వరకు 2,539.61 కోట్ల రూపాయల వ్యయం తో కేంద్రీయరంగం లో ‘బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్ (బిఐఎన్డి)’ పథకాని కి ఆమోదాన్ని ఇచ్చిన ఆర్థిక వ్యవహారాల సంబంధి మంత్రివర్గ సంఘం

January 04th, 04:22 pm

ప్రసార భారతి.. అదే ఆకాశవాణి (ఎఐఆర్) మరియు దూర్ దర్శన్ (డిడి) ల యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి పరచడం కోసం 2,539.61 కోట్ల రూపాయల వ్యయం తో ‘‘బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్’’ (బిఐఎన్ డి) పేరు తో ఒక కేంద్రీయ రంగ పథకాన్ని అమలు చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన కు ఆర్థిక వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) తన ఆమోదాన్ని తెలిపింది. ఈ ద బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్’’ (బిఐఎన్ డి) పథకం అనేది ప్రసార భారతి సంస్థ కు సంబంధించిన ప్రసార సంబంధి మౌలిక సదుపాయాలు, కంటెంట్ డెవలప్ మెంట్ మరియు సివిల్ వర్కు ల తాలూకు ప్రసార ఖర్చు లు, ఉన్నతీకరణ తో ముడిపడ్డ వ్యయం కోసమని ప్రసార భారతి కి ఆర్థిక సహాయాన్ని అందించడాని కి ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినటువంటి పథకం గా ఉంది.

చాలా కష్టమైన మిషన్లు ప్రశాంతత మరియు స్థిరమైన మనస్సుతో సాధించవచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 29th, 11:30 am

మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడటం మరియు రక్షించటం గురించి మాట్లాడారు. ఆయన థాయ్లాండ్ ఫుట్ బాల్ జట్టు యువ ఆటగాళ్ళను విజయవంతంగా కాపాడిన ప్రయత్నాలు గురించి పేర్కొన్నారు మరియు ప్రశాంతత మరియు స్థిరమైన మనస్సుతో చాలా సవాల్లను అధిగమించవచ్చన్నారు. వివిధ క్రీడలలో ప్రపంచ స్థాయిలో వారి నక్షత్ర ప్రదర్శనల కోసం ఆయన అనేక భారతీయ అథ్లెట్లను ప్రశంసించారు. లోకమాన్య తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి గొప్ప వ్యక్తులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

దేశ‌ వ్యాప్తంగా ఉన్న వ్య‌వ‌సాయ‌దారుల‌తో రేపు నేరుగా సంభాషించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 19th, 07:17 pm

దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి వ్య‌వ‌సాయ‌దారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు (బుధవారం) ఉద‌యం 9.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు. ఈ ముఖాముఖి స‌మావేశం వ్య‌వ‌సాయ‌దారులకు ప్రధాన మంత్రితో నేరుగా సంభాషించేందుకు ఒక అవ‌కాశం లభించ‌నుంది.