రౌర్కెలాలో ఆది మహోత్సవంపై ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

April 08th, 11:33 am

దేశానికి గర్వకారణమైన గిరిజన తెగల సంస్కృతి-వారసత్వాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.

‘ఆది మహోత్సవ్’ కు లభించిన విస్తృత స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 23rd, 09:15 am

‘ఆది మహోత్సవ్’ కు అన్ని వర్గాల వారి నుండి స్పందన లభించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపి డాక్టర్ శ్రీ భోలా సింహ్ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందించారు. శ్రీ భోలా సింహ్ ‘ఆది మహోత్సవ్’ ను తాను సందర్శించిన విషయాన్ని వెల్లడిస్తూ, ఆది మహోత్సవ్ ను చాలా చక్కనైన పద్ధతి లో ఏర్పాటు చేశారు, అక్కడ మీకు యావత్తు భారతదేశం లోని ఆదివాసి సంస్కృతి తాలూకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కానవస్తుంది అని పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియంలో ‘ఆది మహోత్సవం’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 16th, 10:31 am

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండా, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీమతి రేణుకా సింగ్, డాక్టర్‌ భారతీ పవార్, శ్రీ బిశేశ్వర్ తుడుసహా ఇతర ప్రముఖులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల నా గిరిజన సోదరసోదరీమణులారా! ఆది మహోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ ప్రారంభించిన ప్రధాని

February 16th, 10:30 am

జాతీయ గిరిజన మహోత్సవమైన ఆది మహోత్సవ్ ను ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని జాతీయ వేదికమీద ప్రదర్శించే ప్రయత్నమే ఆది మహోత్సవ్. ఆ విధంగా గిరిజనుల సంస్కృతి, హస్త కళలు, ఆహార సంప్రదాయాన్ని, వాణిజ్యాన్ని, సంప్రదాయ కళలను ప్రదర్శించే వార్షిక కార్యక్రమమిది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని ముందుగా భగవాన్ బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించి ఎగ్జిబిషన్ లోని స్టాల్స్ అన్నీ కలియదిరిగారు.

‘‘ఆది మహోత్సవ్’’ ను ఫిబ్రవరి 16వ తేదీ న దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

February 15th, 08:51 am

దేశం లో ఆదివాసి జన సంఖ్య సంక్షేమం కోసం తగిన చర్యల ను తీసుకోవడం లో ప్రధాన మంత్రి ఎప్పటికీ ముందు నిలుస్తున్నారు. దీనితో పాటు, దేశం యొక్క ఉన్నతి కి మరియు అభివృద్ధి కి ఆదివాసి సముదాయాలు అందిస్తున్న తోడ్పాటుకు తగిన సమ్మానాన్ని కూడా ప్రధాన మంత్రి కట్టబెట్టుతూ వస్తున్నారు. జాతీయ రంగ స్థలం పైన ఆదివాసి సంస్కృతి ని ప్రకటించే ప్రయాసల లో భాగం గా ‘‘ఆది మహోత్సవ్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు.