మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన
January 20th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్నాథ్ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.మారిషస్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
January 20th, 04:49 pm
భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల తరఫున మారిషస్ లోని సోదర సోదరీమణులందరికీ నమస్కారం , శుభోదయం, థాయి పూసమ్ కావడీ ఉత్సవ శుభాకాంక్షలు.