సోషల్ మీడియా కార్నర్ 21 జూన్ 2018

June 21st, 08:04 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ప్రపంచ ఎంతో ఉత్సాహంతో నాలుగవ యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రపంచం

June 21st, 03:04 pm

నాల్గవ యోగ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రపంచం మొత్తం అపారమైన ఉత్సాహంతో పాలుపంచుకుంది. యోగా శిక్షణా శిబిరాలు, సెషన్లు మరియు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరిగాయి, యోగను మరింత చేరువ చేయడానికిమరియు యోగను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలను అవగాహన చేసుకోండి.

యోగ ప్రదర్శనలకు నేతృత్వం వహించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు మరియు ముఖ్యమంత్రులు

June 21st, 01:25 pm

గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు యోగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మరియు సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించారు.

2018 జూన్ 21వ తేదీన దెహ్ రాదూన్ లో జ‌రిగిన 4వ అంత‌ర్జాతీయ యోగ దినం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

June 21st, 07:10 am

ప్ర‌పంచ‌మంత‌టా విస్త‌రించిన యోగా ప్రేమికుల‌కు నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినం నాడు పవిత్రమైన క్షేత్రమైనటువంటి దేవ భూమి ఉత్త‌రాఖండ్ నుండి నేను నా యొక్క శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.

4వ అంత‌ర్జాతీయ యోగ దినం నాడు ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

June 21st, 07:05 am

ప్ర‌పంచం లో అత్యంత శ‌క్తిమంత‌మైన ‘ఏకతా శ‌క్తుల’లో ఒక‌టి గా యోగ మారిందని ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు. నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినాన్ని పురస్కరించుకొని ఉత్త‌రాఖండ్ లోని దెహ్ రాదూన్ లో గ‌ల ఫారెస్ట్ రిస‌ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆవ‌ర‌ణ‌ లో ఒక భారీ స‌భ‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌ధాన మంత్రి ఫారెస్ట్ రిస‌ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆవ‌ర‌ణ‌ లో యోగా ఔత్సాహికులు మరియు స్వ‌చ్ఛంద సేవ‌కులు దాదాపు 50,000 మందితో పాటు యోగాస‌నాలలో, ప్రాణాయామంలో, ఇంకా ధ్యానంలో పాలుపంచుకొన్నారు.

దెహ్ రాదూన్ లో నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వాలకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 20th, 01:24 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 జూన్ 21వ తేదీ నాడు (గురువారం) దెహ్ రాదూన్ లో జరిగే 4వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాల‌కు నాయకత్వం వ‌హించ‌నున్నారు.

యోగా అనేది 'నేను’ నుండి 'మేము' కు ప్రయాణం: ప్రధానమంత్రి మోదీ

June 18th, 08:47 pm

ట్విట్టర్ లో ఒక వీడియో సందేశం లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మనము #4thYogaDay కు చేరుకానుండడంతో, నేను ప్రపంచవ్యాప్తంగా ప్రజలను యోగాను వారి జీవితాలను భాగంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు అది ఆరోగ్య భీమాకి పాస్పోర్ట్. యోగా ఒక సామూహిక ఉద్యమంగా చేయాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.