అయోధ్యలో భవ్య, దివ్య దీపోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నగరవాసులతోపాటు యావద్భారత ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శ్రీ రామచంద్రుని జన్మస్థలమైన పవిత్ర అయోధ్య నగరంలో దీపోత్సవ శోభపై తన సంతోషాన్ని సగర్వంగా ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:
‘‘ఇదెంతో అద్భుతం.. అసమానం.. అమోఘం!
ఈ దివ్య, భవ్య దీపోత్సవంపై అయోధ్య నగర ప్రజలకు అనేకానేక అభినందనలు! లక్షలాది దివ్వెలతో భావోద్వేగభరితంగా సాగుతున్న ఈ జ్యోతిపర్వం బాల రాముడు జన్మించిన ఈ పుణ్యక్షేత్రాన్ని తేజోమయం చేసింది. అయోధ్య ధామం నుంచి పుట్టుకొచ్చిన ఈ కాంతి పుంజం దేశవ్యాప్తంగాగల నా కుటుంబ సభ్యులలో నవ్యోత్సాహం, నవోత్తేజం నింపుతోంది. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆ శ్రీ రాముడు వరమివ్వాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ రామ్!’’ అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది దీపావళికిగల ప్రత్యేకతను వివరిస్తూ-
अद्भुत, अतुलनीय और अकल्पनीय!
— Narendra Modi (@narendramodi) October 30, 2024
भव्य-दिव्य दीपोत्सव के लिए अयोध्यावासियों को बहुत-बहुत बधाई! लाखों दीयों से आलोकित राम लला की पावन जन्मस्थली पर यह ज्योतिपर्व भावविभोर कर देने वाला है। अयोध्या धाम से निकला यह प्रकाशपुंज देशभर के मेरे परिवारजनों में नया जोश और नई ऊर्जा भरेगा। मेरी… https://t.co/kmG57AJiPH pic.twitter.com/1Dyz6Ztamf
‘‘పవిత్ర అయోధ్య!లో
మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన మహా మందిరంలో ప్రతిష్ఠితుడైన తర్వాత మనం నిర్వహించుకుంటున్న తొలి దీపావళి ఇది. అయోధ్యలోని బాల రాముడు వెలసిన ఈ ఆలయ అపూర్వ సౌందర్యం అందర్నీ ఆనంద సాగరంలో ఓలలాడిస్తోంది. అర్ధ శతాబ్దం (500 ఏళ్ల) తర్వాత లక్షలాది రామభక్తుల నిరంతర త్యాగాలు, కష్టాల అనంతరం ఆవిష్కృతమైన పవిత్ర క్షణమిది. ఈ చారిత్రక సందర్భానికి మనమంతా ప్రత్యక్ష సాక్షులం కావడం నిజంగా మన సుకృతం. ‘వికసిత భారత్’ సంకల్ప సాకారంలో శ్రీ రామచంద్రుని జీవితం, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలవన్నది నా ప్రగాఢ విశ్వాసం...
జై సియారాం!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
अलौकिक अयोध्या!
— Narendra Modi (@narendramodi) October 30, 2024
मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के अपने भव्य मंदिर में विराजने के बाद यह पहली दीपावली है। अयोध्या में श्री राम लला के मंदिर की यह अनुपम छटा हर किसी को अभिभूत करने वाली है। 500 वर्षों के पश्चात यह पावन घड़ी रामभक्तों के अनगिनत बलिदान और अनवरत त्याग-तपस्या के बाद… https://t.co/e0BwDRUnV6