అమర్ నాథ్ యాత్ర సందర్భం లో భక్త జనుల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. శ్రీ అమర్ నాథ్ యాత్ర దివ్యమైందని, అది మన వారసత్వం తాలూకు వైభవోపేతమైనటువంటి ప్రతిబింబం అని ఆయన అభివర్ణించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ అమర్ నాథ్ జీ యాత్ర అనేది మన వారసత్వం యొక్క ఒక దివ్యమైనటువంటి మరియు భవ్యమైనటువంటి స్వరూపం గా ఉన్నది. బాబా బర్ఫానీ యొక్క ఆశీర్వాదం తో భక్త జనులు అందరి జీవనం లో సరిక్రొత్త ఉత్సాహం మరియు నూతన శక్తి ప్రసరించాలని. దానితో పాటు అమృత కాలం లో మన దేశం ‘సంకల్ప్ సే సిద్ధి’ దిశ లో వేగం గా ముందుకు సాగాలని నేను కోరుకొంటున్నాను. జయ్ బాబా బర్ఫానీ.’’ అని పేర్కొన్నారు.
श्री अमरनाथ जी की यात्रा हमारी विरासत का एक दिव्य और भव्य स्वरूप है। मेरी कामना है कि बाबा बर्फानी के आशीर्वाद से सभी श्रद्धालुओं के जीवन में नए उत्साह और नई ऊर्जा का संचार हो, साथ ही अमृतकाल में हमारा देश संकल्प से सिद्धि की ओर तेजी से आगे बढ़े। जय बाबा बर्फानी!
— Narendra Modi (@narendramodi) July 1, 2023