ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝాన్సీ నగరాన్ని సందర్శించారు. నగరంలో రక్షణ కారిడార్కు శంకుస్థాపన చేయడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో
ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా “మన ‘పొరుగు దేశం’ కుయుక్తులకు, కుట్రలకు దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ భారత్ వెన్నంటే ఉన్నాయి, పూర్తి మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు పుల్వామా విషాదంపై అందిన అనేక సందేశాల్లో సంతాపమేగాక తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశాధినేతలందరూ సంసిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు. మన వీరసైనికులు తమ జీవితాలను దేశం కోసం ధారపోశారని, వారి త్యాగం వృథాపోదని
ప్రధానమంత్రి చెప్పారు. పుల్వామా దాడి కారకులను కచ్చితంగా శిక్షించి తీరుతామని వాగ్దానం చేశారు. “ఇది నవ భారతమని మన పొరుగుదేశం మరచిపోయింది. పాకిస్థాన్ ప్రస్తుతం భిక్షాపాత్ర పట్టుకుని ప్రపంచాన్ని సాయం కోసం అడుక్కుంటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఝాన్సీలో రక్షణ కారిడార్కు శంకుస్థాపన చేసిన ఆయన, ఝాన్సీ-ఆగ్రా మధ్య ఏర్పాటు కానున్న ఈ కారిడార్ వల్ల ఈ ప్రాంతంలోని అనేకమంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనేక స్వదేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడతాయన్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలోని కార్మికశక్తికి నైపుణ్య శిక్షణను అందిస్తాయని చెప్పారు. ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి యువతీయువకులు మరో చోటకు వెళ్లాల్సిన దుస్థితి ఇక ఉండదని, వారంతా స్వస్థలంలో ఉద్యోగాలు పొందగలగటమే ఈ కారిడార్ ప్రాముఖ్యమని వివరించారు. రక్షణ ఉత్పత్తుల విషయంలో భారతదేశం
స్వావలంబన సాధించేందుకు కూడా ఈ కారిడార్ తోడ్పడుతుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
బుందేల్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాలకు పైప్లైన్లద్వారా మంచినీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కరవుపీడిత ప్రాంతానికి ఇది కేవలం పైప్లైన్ మాత్రమే కాదని లైఫ్లైన్
(జీవనరేఖ) కూడా కాగలదని ఆయన చెప్పారు. మన తల్లులు, అక్కచెల్లెళ్లకు బిందెడు నీటికోసం బండెడు దూరం నడవాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు. ఇకపై ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ద్వారా మంచినీరు
సరఫరా అవుతుందని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ‘అమృత్’ (AMRUT) పథకం కింద ఝాన్సీ
నగరానికి తాగునీరు సరఫరా పథకం రెండో దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రూ.600 కోట్లతో రూపొందుతున్నదని, దీనిద్వారా బెట్వా నది నుంచి ఝాన్సీతోపాటు పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తారని వివరించారు. దీంతోపాటు 425 కిలోమీటర్ల పొడవైన ఝాన్సీ-మాణిక్పూర్, భీమ్సేన్-ఖైరార్ రైలు మార్గాలను రెండు లైన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో ఝాన్సీ నగరంలో రైలు పెట్టెల సుందరీకరణ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఝాన్సీ-ఖైరార్ సెక్షన్లో విద్యుదీకరణ పూర్తయిన 297 కిలోమీటర్ల రైలుమార్గాన్నిప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నిటివల్ల పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందని, మొత్తంమీద బుందేల్ఖండ్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఇవన్నీ తోడ్పడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్ ప్రాంతం కూడా బుందేల్ఖండ్ వంటిదేనని, కచ్ తరహాలోనే ఈ ప్రాంతం కూడా ప్రగతి పథంలో పయనించగలదని ఈ
సందర్భంగా మాట్లాడుతూ- ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్కు నిరంతర విద్యుత్ సరఫరాకు ఉద్దేశించిన పశ్చిమ-ఉత్తరప్రాంత విద్యుత్ ప్రసార
వ్యవస్థ బలోపేత ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఈ ప్రాంత విద్యుత్ అవసరాలు తీరే అవకాశాలు మెరుగవుతాయి. ఇవాళ ప్రారంభమైన ప్రాజెక్టులలో పహరీ డ్యామ్ ఆధునికీకరణ ప్రాజెక్టుకూ విశేష ప్రాధాన్యముంది. ప్రస్తుతం డ్యామ్ నుంచి నీటి లీకేజీని అరికట్టి రైతులకు నీటి సరఫరాను
మెరుగుపరచేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ప్రధానమంత్రి రైతు గౌరవ నిధి పథకం” కింద దేశంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసేందుకు రూ.7.5 లక్షల కోట్ల మేర బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించారు. ఇదేవిధంగా ఇప్పటివరకూ రాయితీలు, ఉపకారవేతనాలు వంటివాటిని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడంద్వారా లీకేజీలను అరికట్టడంవల్ల రూ.లక్ష కోట్లదాకా ఆదా అయినట్లు వివరించారు.
बदहाली के इस दौर में वो भारत पर इस तरह के हमले करके,
— PMO India (@PMOIndia) February 15, 2019
पुलवामा जैसी तबाही मचाकर, हमें भी बदहाल करना चाहता है।
लेकिन उसके इस मंसूबे का, देश के 130 करोड़ लोग, मिलकर जवाब देंगे, मुंहतोड़ जवाब देंगे: PM in Jhansi
थोड़ी देर पहले बुंदेलखंड और यूपी के विकास से जुड़े लगभग 20 हज़ार करोड़ रुपए के विकास कार्यों का शिलान्यास और लोकार्पण किया गया है।
— PMO India (@PMOIndia) February 15, 2019
इसमें सुरक्षा, रोजगार, रेल, बिजली-पानी, से जुड़े अनेक प्रोजेक्ट हैं: PM
अब बुंदेलखंड को देश की सुरक्षा और विकास का कॉरिडोर बनाने का अभियान शुरु हो चुका है।
— PMO India (@PMOIndia) February 15, 2019
ये डिफेंस कॉरिडोर देश को सशक्त करने के साथ ही उत्तर प्रदेश के युवाओं को रोज़गार के नए अवसर भी उपलब्ध कराने वाला है।
मुझे बताया गया है कि लगभग 4 हज़ार करोड़ रुपए के समझौते हो भी चुके हैं: PM
जब बड़े उद्योग लगते हैं तब उनके आसपास छोटे उद्योगों का भी विकास होता है, एक पूरा वातावरण तैयार होता है।
— PMO India (@PMOIndia) February 15, 2019
झांसी और आसपास के क्षेत्रों में जो छोटे उद्योग हैं उनको इस कॉरिडोर से बहुत बड़ा लाभ होने वाला है।
इस कॉरिडोर से यहां के लाखों युवाओं को सीधा रोजगार मिलेगा: PM
बुंदेलखंड की मेरी आप सभी लोगों को पानी के लिए कितना संघर्ष करना पड़ता रहा है, इसका मुझे ऐहसास है।
— PMO India (@PMOIndia) February 15, 2019
आपको पानी की समस्या से मुक्ति दिलाने के प्रयास को आगे बढ़ाते हुए, आज 9 हजार करोड़ की
पाइप-लाइन का शिलान्यास आज किया गया है: PM
इस प्रोजेक्ट के पूरा होने के बाद बुंदेलखंड के हर जिले यानि
— PMO India (@PMOIndia) February 15, 2019
झांसी,
ललितपुर,
जालौन,
हमीरपुर,
महोबा,
बांदा और
चित्रकूट के करीब-करीब हर गांव को पीने का पानी मिलना और आसान हो जाएगा: PM