ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీ న రాత్రి 7 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగే ‘‘పరీక్షా పే చర్చా 2021’’ కార్యక్రమం లో భాగం గా ప్రపంచవ్యాప్త విద్యార్థుల తోను, గురువుల తోను, తల్లితండ్రుల తోను మాట్లాడనున్నారు.
‘‘సాహసికులైన మన #ExamWarriors తో, తల్లితండ్రుల తో, గురువుల తో ఒక కొత్త నమూనా లో అనేక విషయాల ను గురించి ఆసక్తి ని రేకెత్తించేటటువంటి ప్రశ్నల తో ఓ స్మరణీయమైన చర్చ చోటు చేసుకోనుంది.
ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 7 గంటల కు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని చూడగలరు… #PPC2021 ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
A new format, several interesting questions on a wide range of subjects and a memorable discussion with our brave #ExamWarriors, parents and teachers.
— Narendra Modi (@narendramodi) April 5, 2021
Watch ‘Pariksha Pe Charcha’ at 7 PM on 7th April...#PPC2021 pic.twitter.com/5CzngCQWwD