గ్యాస్ ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధన దిశగా ఒక కొత్త రికార్డును నెలకొల్పినందుకు పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో శక్తి రంగంలో స్వయంసమృద్ధి ఎంతో ముఖ్యమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
గ్యాస్ ఉత్పత్తి రంగంలో దేశం ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో ఒక కొత్త రికార్డును సాధించిందని పెట్రోలియమ్-సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురీ ‘ఎక్స్’ మాధ్యమం లో తెలిపారు. గ్యాస్ ఉత్పత్తి 2020-21 లో 28.7 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బిసిఎమ్) గా నమోదైంది. అది 2023-24లో 36.43 బిసిఎమ్ కు వృద్ధి చెందింది. గ్యాస్ ఉత్పత్తి 2026లో 45.3 బిసిఎమ్ కు చేరుకొనే అవకాశం ఉందని కేంద్ర మంత్రి వెల్లడించిన డేటా అంచనా వేసింది.
కేంద్ర మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో వెల్లడించిన సమాచారానికి ప్రధానమంత్రి ప్రతి స్పందిస్తూ -
‘‘ఈ కార్యసాధనకు గాను దేశ ప్రజలకు చాలా చాలా అభినందనలు.
శక్తి రంగంలో మన స్వయం సమృద్ధి వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో చాలా ముఖ్యం. గ్యాస్ ఉత్పాదనలో ఈ రికార్డు ఈ దిశలో మన నిబద్ధతకు ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది.’’ అని పేర్కొన్నారు.
देशवासियों को इस उपलब्धि के लिए बहुत-बहुत बधाई!
— Narendra Modi (@narendramodi) August 4, 2024
विकसित भारत के संकल्प की सिद्धि में ऊर्जा के क्षेत्र में हमारी आत्मनिर्भरता बहुत महत्वपूर्ण है। गैस उत्पादन का यह रिकॉर्ड इस दिशा में हमारी प्रतिबद्धता का प्रत्यक्ष प्रमाण है। https://t.co/czlrxvTFJt