పంజాబ్ లోని బతిందాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“పంజాబ్ లోని బతిందాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమైన విషయం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మరణించిన ప్రతీ వ్యక్తి కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. గాయాల పాలైన వ్యక్తులకు రూ. 50 వేల చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi”
Saddened by the loss of lives in the bus accident in Bathinda, Punjab. Condolences to those who lost their loved ones. May the injured recover soon.
— PMO India (@PMOIndia) December 27, 2024
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000:…