బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ కు, రాజేంద్ర ప్రసాద్ కు నమస్కరించారు
బాపూ జీ కి మరియు స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రాణత్యాగం చేసిన వారు అందరికీశ్రద్ధాంజలి ని ఘటించారు
26/11 ఘటన లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ని అర్పించారు
‘‘రాజ్యాంగ దినాన్నిజరుపుకోవాలి, ఎందుకు అంటే అది మనంవెళ్తున్న మార్గం సరి అయినదో లేక సరి కానిదో అనే విషయాన్ని ఎప్పటికప్పుడుమూల్యాంకనం చేసుకొనే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి’’
‘‘భారతదేశం ఒక తరహాసంక్షోభం వైపు సాగిపోతోంది. అది రాజ్యాంగాని కిఅంకితం అయినటువంటి వారికి ఆందోళన ను కలిగించే విషయం గా ఉంది – మరి ఆ విషయం ఏది అంటే, అదే కుటుంబం ఆధారితమైన పార్టీ లు’’
‘‘ప్రజాస్వామికస్వభావాన్ని కోల్పోయిన పార్టీ లు ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించగలుగుతాయి ?’’
‘‘దేశంస్వాతంత్య్రాన్ని సిద్ధింప చేసుకొన్న అనంతరం కర్తవ్యం పట్ల ప్రాధాన్యాన్ని ఇచ్చిఉండి ఉంటే బాగుండేది. స్వాతంత్య్రం తాలూకు అమృత్ మహోత్సవ్ లో మన హక్కుల ను కాపాడుకోవాలి అంటే కర్తవ్యపథం లో ముందుకు సాగిపోవడం మనకు అవసరం గా మారిపోయింది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పార్లమెంటు లో జరిగిన రాజ్యాంగ దినం సంబంధి ఉత్సవం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్య రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు లోక్ సభ స్పీకర్ ప్రసంగించారు. మాననీయ రాష్ట్రపతి తన ప్రసంగం అనంతరం, రాజ్యాంగ పీఠిక ను చదివారు. దీనిని నేరు గా ప్రసారం చేయడం జరిగింది. మాననీయ రాష్ట్రపతి రాజ్యాంగ పరిషత్తు వాదోపవాదాల తాలూకు డిజిటల్ వెర్శను ను, భారతదేశ రాజ్యాంగం యొక్క చక్కని చేతిరాత ప్రతి తాలూకు డిజిటల్ వెర్శను ను మరియు ఇంతవరకు చేయబడినటువంటి అన్ని సవరణల తో కూడిన భారతదేశం రాజ్యాంగ వర్తమాన ప్రతి ని ఆవిష్కరించారు. ఆయన ‘ఆన్ లైన్ క్విజ్ ఆన్ కాన్స్ టిట్యూశనల్ డిమాక్రసి’ ని కూడా ప్రారంభించారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నేటి రోజు బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాపూ గారు ల వంటి దూరదర్శి మహానుభావుల కు శ్రద్ధాంజలి ని సమర్పించవలసిన రోజు. అలాగే స్వాతంత్య్ర పోరాటం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వారు అందరికి కూడాను నమస్కరించవలసినటువంటి దినం అని పేర్కొన్నారు. ఈ రోజు ఈ సదనాని కి వందనాన్ని ఆచరించవలసిన రోజు అని పేర్కొన్నారు. ఆ కోవ కు చెందిన దిగ్గజాల నాయకత్వం లో అనేక చర్చ లు, ఎంతో మేధోమథనం జరిగిన తరువాత మన రాజ్యాంగం అనేటటువంటి అమృతం బయటకు వచ్చింది అని ఆయన అన్నారు. ఈ రోజు న ప్రజాస్వామ్యం తాలూకు ఈ సదనాని కి కూడా ప్రణామం చేయవలసినటువంటి రోజు అని ఆయన స్పష్టం చేశారు. 26/11 నాటి అమరవీరుల కు సైతం ప్రధాన మంత్రి వందనాన్ని ఆచరించారు. ‘‘ఈ రోజు 26/11 మనకు ఎటువంటి దుఃఖదాయకం అయిన రోజు అంటే దేశాని కి శత్రువులు అయిన వారు దేశం లోపల కు వచ్చి ముంబయి లో ఉగ్రవాద దాడి కి తెగబడ్డారు. దేశం యొక్క వీర జవానులు ఉగ్రవాదుల తో పోరాడుతూ తమ జీవితాల ను త్యాగం చేసివేశారు. ప్రాణసమర్పణం చేసినటువంటి వారి కి సైతం ఈ రోజున నేను నమస్కరిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మన రాజ్యాంగం అనేక వ్యాసాల సంకలనం ఒక్కటే కాదు. మన రాజ్యాంగం వేల సంవత్సరాల తాలూకు ఒక ఘనమైన సంప్రదాయం గా ఉంది. ఇది అఖండమైన స్రవంతి తాలూకు ఒక ఆధునికమైన అభివ్యక్తి గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగ దినాన్ని మనం మరొకందుకు కూడాను జరుపుకోవాలి.. ఎందుకు అంటే మనం వెళ్తున్నటువంటి దారి సరి అయినదా, లేక సరి అయినది కాదా అనే దానిని గురించి ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకొనే అవసరాన్ని అది మనకు ప్రసాదిస్తుంది కాబట్టి అని ప్రధాన మంత్రి అన్నారు.

‘రాజ్యాంగ దినాన్ని’ జరుపుకోవడానికి వెనుక దాగి ఉన్నటువంటి భావన ను గురించి ప్రధాన మంత్రి మరింత వివరం గా చెప్తూ, ‘‘బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ 125వ జయంతి సందర్భం ఉండిందో, మనందరికీ అప్పుడు అనిపించింది ఏమని అంటే దీని కన్నా ప్రధానమైనటువంటి, పవిత్రమైనటువంటి సందర్భం మరేమిటి ఉండగలదు, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ఈ దేశానికి ఏ కానుక ను అయితే ఇచ్చారో దానిని మనం సదా ఒక స్మృతి గ్రంథం రూపం లో గుర్తుకు తెచ్చుకొంటూ ఉందాం అని..’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జనవరి 26ను గణతంత్ర దినం గా పాటించే సంప్రదాయాన్ని ఏర్పరచుకొన్నప్పుడే దానితో పాటే అదే సమయం లో నవంబర్ 26 ను కూడా ‘రాజ్యాంగ దినం’ రూపం లో ఆచరించుకోవాలి అని నిర్ధారించి ఉంటే బాగుండేది అని ఆయన అన్నారు.

కుటుంబం పై ఆధారపడ్డ పార్టీల తో భారతదేశం ఒక విధమైన సంక్షోభం దిశ లో పయనిస్తున్నది. ఈ విషయం రాజ్యాంగం పట్ల అంకిత భావాన్ని కలిగివున్న వారికి ఒక ఆందోళన కారకమైన విషయం గా ఉంది. ఇది ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని పెట్టుకొన్న వారికి చింత ను కలిగించే ఒక విషయం గా ఉంది అని ఆయన అన్నారు. ‘‘యోగ్యత ఆధారం గా ఒక కుటుంబం లో నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది పార్టీ లో చేరితే, దీనివల్ల పార్టీ పరివార వాది పార్టీ గా కాబోదు. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక పార్టీ తరం తరువాత తరం ఒకే కుటుంబం ద్వారా నడపబడుతూ ఉన్నప్పుడు’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగం యొక్క భావన కు కూడా దెబ్బ తగిలింది, రాజ్యాంగం లోని ఒక్కొక్క భాగాని కి కూడాను గాయం అయింది.. ఎప్పుడైతే రాజకీయ పక్షాలు వాటంతట అవి తమ ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోతాయో.. అని చెప్తూ, ప్రధాన మంత్రి దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఏ పార్టీ లు అయితే వాటి యొక్క ప్రజాస్వామ్యయుత స్వభావాన్ని కోల్పోతాయో, అవి ప్రజాస్వామ్యాన్ని ఏ విధం గా కాపాడగలుగుతాయి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

దోషులు గా గుర్తించిన అవినీతిపరుల ను మరచిపోయేటటువంటి మరియు వారిని కీర్తించేటటువంటి ప్రవృత్తి తగదు అని కూడా ప్రధాన మంత్రి హెచ్చరిక ను చేశారు. బాగుపడడానికి అవకాశాన్ని ఇస్తూ ఇటువంటి వ్యక్తుల పై సార్వజనిక జీవనం లో ప్రశంసల ను కురిపించకుండా మనం ఉండాలి అని ఆయన అన్నారు.

గాంధీ మహాత్ముడు స్వాతంత్య్ర ఉద్యమం లో హక్కుల కోసం పోరాడుతూనే, కర్తవ్యాల కోసం దేశ ప్రజల ను సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశం స్వాతంత్య్రాన్ని సిద్ధింప చేసుకొన్న తరువాత కర్తవ్యం గురించి స్పష్టం చేసి ఉండి ఉంటే బాగుండేది. స్వాతంత్య్రం తాలూకు అమృత్ మహోత్సవ్ లో కర్తవ్య పథం లో ముందుకు సాగిపోవడం అనేది మనకు అవసరం గా ఉన్నది. ఆ పని ని చేశాము అంటే గనక మన హక్కుల ను రక్షించుకోవడం కుదురుతుంది’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi