ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు అంటే ఈ నెల 24 న జరిగిన ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) 36వ సమావేశాని కి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశం లో, పది చర్చనీయాంశాల పై సమీక్షను చేపట్టారు. చర్చనీయాంశాలలో ఎనిమిది ప్రాజెక్టు లు, ఒక పథకానికి, మరొక కార్యక్రమాని కి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఎనిమిది ప్రాజెక్టుల లోను మూడు ప్రాజెక్టు లు రోడ్డు రవాణా, రాజమార్గాల మంత్రిత్వ శాఖ కు చెందినవి కాగా, రెండు ప్రాజెక్టు లు రైల్వేస్ మంత్రిత్వ శాఖ కు చెందినవి; మిగిలిన ప్రాజెక్టుల లో విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లకు చెందిన ఒక్కొక్క ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి. ఈ ఎనిమిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు గా 44,545 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టులు 12 రాష్ట్రాల కు చెందినవి. ఈ పన్నెండు రాష్ట్రాలలో పశ్చిమ బంగాల్, అసమ్, తమిళ నాడు, ఒడిశా, ఝార్ ఖండ్, సిక్కిమ్, ఉత్తర్ ప్రదేశ్, మిజోరమ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, బిహార్ లతో పాటు మేఘాలయ కూడా ఉంది.
కొన్ని ప్రాజెక్టుల ను అమలు లో జాప్యాలు జరుగుతున్నట్లు ప్రధాన మంత్రి గమనించి దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కారం కాకుండా మిగిలిన అంశాలన్నిటిని కాలబద్ద పద్ధతి న పరిష్కరించవలసిందని, సాధ్యమైన చోటల్లా పనుల ను ఉద్యమ తరహా లో జరిపించవలసిందంటూ సంబంధిత అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు.
ఈ సంభాషణ క్రమం లో, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను నిర్మూలించే కార్యక్రమం గురించి కూడా ప్రధాన మంత్రి సమీక్ష ను చేపట్టారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కు సంబంధించిన ఇబ్బందుల ను గురించి కూడా సమీక్షించడమైంది. తగినటువంటి జాగృతి ప్రచార ఉద్యమం చేపట్టడం ద్వారా ప్రజలను, ప్రత్యేకించి యువతీ యువకులను ఈ ప్రాజెక్టు లో వారు కూడా పాలుపంచుకొనేటట్లు చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి సూచించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన లో భాగం గా నిర్మాణాధీనం లో ఉన్న రహదారుల నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అంటూ అధికారుల కు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
ఇంతకు ముందు జరిగిన ‘ప్రగతి’ సమావేశాలు ముప్ఫై అయిదింటిలో దాదాపు గా 13.60 లక్షల కోట్ల రూపాయల వ్యయం తో కూడిన 290 ప్రాజెక్టులే కాకుండా 51 కార్యక్రమాలు / పథకాల తో పాటు 17 వివిధ రంగాల కు చెందిన ఫిర్యాదుల ను గురించి సమీక్షించడమైంది.