దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా స్థితిగతులను సమీక్షించడానికి, ఆక్సీజన్ అందుబాటు ను ఏయే విధాలు గా పెంచవచ్చో అనే విషయం పై చర్చించడానికి నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ప్రాణవాయువు లభ్యత ను మెరుగుపరచడం కోసం గత కొద్ది వారాల లో చేపట్టిన కృషి ని గురించి అధికారులు ఆయన దృష్టి కి తీసుకు వచ్చారు.
ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం, ఆక్సీజన్ పంపిణీ లో వేగాన్ని పెంచడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కు ఆక్సీజన్ ను చేరవేయడానికి వినూత్న మార్గాలను ఉపయోగించడం అనేటటువంటి అనేక అంశాల పైన శర వేగంగా పనిచేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
రాష్ట్రాలలో ఆక్సీజన్ కు ఉన్నటువంటి డిమాండు ను గురించి తెలుసుకోవడం కోసం, దానికి తగ్గట్టుగా ఆక్సీజన్ ను సరఫరా చేసేందుకు చొరవ తీసుకోవడం కోసం రాష్ట్రాల తో సమన్వయాన్ని నెలకొల్పుకొని భారీ కసరత్తు ను చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. రాష్ట్రాలకు ఆక్సీజన్ సరఫరా ఏ విధం గా నిలకడ గా వృద్ధి చెందుతున్నదీ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది. 20 రాష్ట్రాల లో ప్రస్తుతం రోజు కు 6,785 ఎమ్ టి ల లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ అవసరపడుతుండగా, భారత ప్రభుత్వం ఏప్రిల్ 21 నాటి నుంచి ఆ రాష్ట్రాలకు రోజు కు 6,822 ఎమ్ టి లను కేటాయించింది.
ప్రైవేటు స్టీల్ ప్లాంటు లు, పబ్లిక్ స్టీల్ ప్లాంటు లు, పరిశ్రమ లు, ఆక్సీజన్ తయారీదారు సంస్థల తోడ్పాటు తో పాటు అంతగా ముఖ్యం కానటువంటి పరిశ్రమల కు ఆక్సీజన్ సరఫరా పై నిషేధాన్ని అమలుపరుస్తున్న కారణం గా కూడాను లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ లభ్యత గత కొన్ని రోజుల లో రోజు కు దాదాపు 3,300 ఎమ్ టి మేర కు అధికం అయినట్లు గమనించారు.
మంజూరు అయినటువంటి పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను సాధ్యపడినంత త్వరగా పూర్తి చేసి పనిచేయించేడానికి వీలు గా రాష్ట్రాల తో తాము భుజం భుజం కలిపి పనిచేస్తున్నట్లు అధికారులు ప్రధాన మంత్రి కి వివరించారు.
వివిధ రాష్ట్రాల కు సాఫీగాను, అవాంతరాలు ఎదురు కానటువంటి పద్ధతి లోను ఆక్సీజన్ సరఫరా అయ్యేటట్టు చూడవలసింది గా అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు. ఏదయినా అడ్డంకి ఎదురయ్యే పక్షం లో స్థానిక పాలనయంత్రాంగం సైతం జవాబుదారుతనం వహించేటట్టుగా చూడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆక్సీజన్ ఉత్పత్తి ని, ఆక్సీజన్ సరఫరా ను పెంచేందుకు గల వేరు వేరు కొంగొత్త మార్గాల ను వెతకవలసింది గా మంత్రిత్వ శాఖల కు కూడా ఆయన సూచన చేశారు.
క్రయోజనిక్ ట్యాంకర్ ల అందుబాటు ను బాగా వేగం గా పెంచడం కోసం నైట్రోజన్, ఆర్గాన్ ట్యాంకర్ లను వాటి లో ఆక్సీజన్ ను తరలించేందుకు వీలు గా తగిన మార్పులను చేయడం, ట్యాంకర్ లను దిగుమతి చేసుకోవడం, ట్యాంకర్ లను వాయు మార్గం లో చేరవేయడం తో పాటు ట్యాంకర్ లను తయారీ చేయడం వంటి వివిధ చర్యల ను చేపట్టడం జరుగుతోంది.
ఆక్సీజన్ ను రాష్ట్రాల కు త్వరగా చేరవేసేటట్టు చూడవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. శీఘ్ర గతి న రవాణా చేయడానికి, అలాగే ట్యాంకర్ లను మధ్యలో ఎక్కడా ఆపకుండా దూరప్రాంతాల కు చేరవేయడానికి రైల్వేస్ ను ఉపయోగిస్తున్న సంగతి కూడా చర్చ కు వచ్చింది. 105 ఎమ్ టి ల ఎల్ ఎమ్ ఒ తో కూడిన ఒకటో రేక్ ముంబయి నుంచి వైజాగ్ కు చేరుకొంది. అదే విధం గా, ఖాళీ చేసిన ఆక్సీజన్ ట్యాంకర్ లను కూడా- ఆక్సీజన్ సరఫరా లో ఒక వైపు ప్రయాణానికి పట్టే కాలాన్ని తగ్గించడం కోసం- ఆక్సీజన్ సరఫరా సంస్థ లు వాయుమార్గం లో చేరవేయడం జరుగుతోంది.
ఆక్సీజన్ ను తగిన విధం గా ఉపయోగించవలసిన అవసరాన్ని గురించి, అలాగే కొన్ని రాష్ట్రాల లో చేపట్టిన లెక్కల తనిఖీ రోగుల స్థితి పై ప్రభావాన్ని చూపించకుండానే ఆక్సీజన్ డిమాండు ను ఏ రకం గా తగ్గించిందీ అనే దానిని గురించి వైద్య సముదాయం ప్రతినిధులు సమావేశం లో వివరించారు.
దొంగనిలువలపై రాష్ట్రాలు కఠిన చర్యలను తీసుకోవాలని కూడా ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
ఈ సమావేశానికి కేబినెట్ సెక్రట్రి, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, హోం సెక్రట్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి లతో పాటు వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ , రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఫార్మస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ ల అధికారులు, నీతి ఆయోగ్ అధికారులు హాజరు అయ్యారు.
Login or Register to add your comment
The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.
Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:
“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”
This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India. https://t.co/7DduJWrlU3
— Narendra Modi (@narendramodi) December 3, 2024