ట్రాక్ అండ్ పీల్డ్ ఈవెంట్స్ లో క్రీడాకారిణి ప్రీతి పాల్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో రెండో పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజున అభినందనలు తెలిపారు.
ఇరవై మూడేళ్ళ వయసున్న ప్రీతి పాల్ మహిళల 200 మీటర్ల టి35 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఆమె పారాలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారులలో రెండు పతకాలను గెలిచిన ప్రథమ భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు :
‘‘ప్రీతి పాల్ చరిత్రాత్మకమైన కార్యాన్ని సాధించారు. పారాలింపిక్స్ (#Paralympics2024) లో ఆమెకు ఇది రెండో పతకం. ఆమె మహిళల 200 మీటర్ల టి35 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఆమె భారతదేశ ప్రజలకు ఒక ప్రేరణగా నిలిచారు. ఆమె అంకితభావం నిజంగా ప్రశంసనీయమైంది అని చెప్పాలి.
చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’
A historic achievement by Preeti Pal, as she wins her second medal in the same edition of the #Paralympics2024 with a Bronze in the Women’s 200m T35 event! She is an inspiration for the people of India. Her dedication is truly remarkable. #Cheer4Bharat pic.twitter.com/4q3IPJDUII
— Narendra Modi (@narendramodi) September 1, 2024