నేను నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడైన మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానాన్ని అందుకొని జులై 13 వ మరియు జులై 14 వ తేదీ లలో ఫ్రాన్స్ కు ఆధికార సందర్శన నిమిత్తం బయలుదేరి వెళుతున్నాను.
ఈ యాత్ర విశిష్టమైంది ఎందుకు అంటే నేను అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో కలసి ఫ్రెంచ్ జాతీయ దినం.. అదే బాస్టీల్ డే వేడుకల లో గౌరవ అతిథి గా పాలుపంచుకోనున్నాను. బాస్టీల్ డే పరేడ్ లో భారతదేశాని కి చెందిన మూడు సేన ల దళాల జట్టు ఒకటి కూడా పాల్గొననుంది; కాగా భారతీయ వాయుసేన కు చెందిన ఒక విమానం ఈ సందర్భం లో ఫ్లయ్- పాస్ట్ ను ప్రదర్శించనుంది.
ఈ సంవత్సరం మన వ్యూహాత్మ భాగస్వామ్యం తాలూకు 25 వ వార్షికోత్సవం కూడా ను. ప్రగాఢ విశ్వాసం మరియు నిబద్ధత లతో పెనవేసుకొన్న మన ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, పౌర ప్రయోజనాల కోసం పరమాణు శక్తి వినియోగం, బ్లూ ఇకానమి, వ్యాపారం, పెట్టుబడి, విద్య, సంస్కృతి మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా విభిన్న రంగాల లో సన్నిహిత సహకారం కొనసాగుతున్నది. మనం ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాల పై కలసి పని చేస్తున్నాం.
అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో సమావేశమవ్వాలని మరియు ఈ చిరకాలిక భాగస్వామ్యాన్ని, కాల పరీక్ష కు తట్టుకొని నిలచినటువంటి భాగస్వామ్యాన్ని రాబోయే 25 సంవత్సరాల పాటు కొనసాగించడం కోసం విస్తృత శ్రేణి చర్చల ను జరపాలని నేను ఉత్సాహపడుతున్నాను. 2022 వ సంవత్సరం లో నేను ఫ్రాన్స్ ను ఆధికారికం గా సందర్శించిన అనంతరం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో భేటీ అయ్యే అవకాశాలు అనేకం దక్కాయి. మరి ఇటీవలే 2023 మే నెల లో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో జాపాన్ లోని హిరోశిమా లో నేను ఆయన తో భేటీ అయ్యాను.
ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెథ్ బోర్న్ గారు, సీనెట్ యొక్క అధ్యక్షుడు మాన్య శ్రీ జెరార్డ్ లార్శల్ , నేశనల్ అసెంబ్లీ అధ్యక్షురాలు యేల్ బ్రాన్-పివే గారు సహా ఫ్రాన్స్ యొక్క నాయకత్వం తో మాటామంతీ జరపడానికి నేను ఉత్సుకత తో ఉన్నాను.
నా సందర్శన లో భాగం గా, చైతన్యం ఉట్టిపడే భారతదేశ ప్రవాసి సముదాయం, ఉభయ దేశాల కు చెందిన అగ్రగామి ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సిఇఒ స్) మరియు ఫ్రాన్స్ కు చెందిన ప్రసిద్ధ వ్యక్తుల తో భేటీ అయ్యే అవకాశం కు ప్రాప్తించనుంది. ఈ యాత్ర తో మన వ్యూహాత్మక భాగస్వామ్యాని కి ఒక క్రొత్త జోరు లభిస్తుందన్న విశ్వాసం నాలో ఉంది.
పేరిస్ నుండి నేను జులై 15 వ తేదీ నాడు ఒక ఆధికారిక సందర్శన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఇఎ) లోని అబూ ధాబీ కి వెళ్తాను. యుఎఇ అద్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు, నా మిత్రుడు మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో సమావేశం కావడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
మన రెండు దేశాలు వ్యాపారం, పెట్టుబడులు, శక్తి, ఆహార సురక్ష, విజ్ఞాన శాస్త్రం & సాంకేతిక విజ్ఞానం, విద్య, ఫిన్ టెక్ , రక్షణ, భ్రదత లతో పాటు ఉభయ పక్షాల ప్రజల మధ్య పటిష్టమైనటువంటి పరస్పర సంబంధాలు వంటి అనేక రంగాల లో సహకరించుకొంటున్నాయి. కిందటి సంవత్సరం లో అధ్యక్షుడు మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ మరియు నేను మన భాగస్వామ్యం యొక్క భవిష్యత్తు సంబంధి మార్గసూచి విషయం లో సమ్మతి ని వ్యక్తం చేశాం. మరి మన సంబంధాల ను మరింత గా విస్తృతం చేసుకోవడం ఎలా అనే విషయమై ఆయన తో చర్చించడాని కి నేను నిరీక్షిస్తున్నాను.
యుఎఇ ఈ సంవత్సరం చివరికల్లా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ది యుఎన్ఎఫ్ సిసిసి (సిఒపి-28) కి ఆతిథేయి గా వ్యవహరించనుంది. జలవాయు సంబంధి కార్యాచరణ ను వేగవంతం చేసే దిశ లో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం అనే అంశం లో నా ఆలోచనల ను వెల్లడించబోతున్నాను. తద్ద్వారా పేరిస్ ఒప్పందం యొక్క అమలు లో భాగం గా శక్తి అంశం లో మార్పు మరియు కార్యరూపం లోకి తీసుకువచ్చే ప్రక్రియ కు రంగం సిద్ధం కాగలదు.
నా యుఎఇ సందర్శన తో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం లో ఒక సరిక్రొత్త అధ్యాయం ఆరంభం అవుతుందని నేను నమ్ముతున్నాను.