ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. సంస్కృతాని కి లోకప్రియత్వాన్ని సంపాదించి పెట్టే పని లో నిమగ్నం అయినటువంటి వారందరి ప్రయాసల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. సంస్కృతం యొక్క సుందరత్వాన్ని గురించి మరియు ఆ భాష యొక్క మహత్త్వాన్ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో తాను విస్తారం గా చర్చించినటువంటి రెండు ఉదాహరణల ను ఆయన శేర్ చేశారు. యువతీయువకుల లో సంస్కృతాని కి ఆదరణ పెరుగుతూ ఉండటాన్ని కూడా ఆయన ప్రముఖ గా ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“విశ్వసంస్కృతదినస్య శుభాశయా: భారతే విశ్వే చ సంస్కృత ప్రచారాయ కార్యం కుర్వతాం సర్వేషామ్ అభినందన్ కరోమి. పూర్వతనే ఏకస్మిన్ #MannKiBaat మధ్యే మయా సంస్కృతస్య మహత్త్వం సౌందర్య చ యత్ ఉక్త్ తత్ అత్ర్ దదామి.’’
विश्वसंस्कृतदिनस्य शुभाशया:। भारते विश्वे च संस्कृतप्रचाराय कार्यं कुर्वतां सर्वेषाम् अभिनन्दनं करोमि। पूर्वतने एकस्मिन् #MannKiBaat मध्ये मया संस्कृतस्य महत्त्वं सौन्दर्यं च यत् उक्तं तत् अत्र ददामि। pic.twitter.com/sv2MyqE09t
— Narendra Modi (@narendramodi) August 12, 2022
गतेषु वर्षेषु युवानः संस्कृतप्रचारे अग्रेसराः सन्ति। अगस्त २०२१ #MannKiBaat मध्ये अहम् एतादृशानां प्रयत्नानां प्रशंसां कृतवान्। आशासे यत् आगामिकाले अपि अस्माकं युवानः संस्कृते रुचिं दर्शयेयुः। pic.twitter.com/siwGzCCCC7
— Narendra Modi (@narendramodi) August 12, 2022