వెహికల్స్క్రాపేజ్ పాలిసీ ని ప్రారంభించారు
ఒకలాభప్రదమైనటువంటి సర్క్యులర్ ఇకానమి ని ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణం పరంగాచూసినప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకొంటూ భాగస్వాములందరికి విలువ ను అందించడమేమా ధ్యేయం గా ఉంది: ప్రధాన మంత్రి
వెహికిల్స్క్రాపేజ్ పాలిసీ దేశం లో పనికి రాని వాహనాల ను రహదారులపై తిరగకుండా వాటిని ఒక శాస్త్రీయ పద్ధతి లో రద్దుచేసి, వాహనాల ను ఆధునీకరించడం లో ప్రధాన పాత్ర నుపోషించనుంది: ప్రధాన మంత్రి
స్వచ్ఛమైన, రద్దీ కి తావు ఉండనటువంటి మరియు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణసాధనాలను అందించడం అనేది 21వ శతాబ్ది భారతదేశాని కితక్షణ ఆవశ్యకత గా ఉంది: ప్రధాన మంత్రి
ఈవిధానం 10 వేల కోట్ల రూపాయలకు పైగాసరికొత్త పెట్టుబడి ని తీసుకు వచ్చి వేల కొద్దీ ఉద్యోగాల ను కల్పిస్తుంది: ప్రధానమంత్రి
చెత్తనుంచి సంపద కు ఆస్కారం ఉండే సర్క్యులర్ ఇకానమి లో ఒక ముఖ్యమైన లంకె గా న్యూస్క్రాపింగ్ పాలిసీ ఉంది: ప్రధాన మంత్రి
పాతవాహనం రద్దయిన సర్టిఫికెటు ను పొందే వ్యక్తులు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినపుడురిజిస్ట్రేశన్ కోసం ఏ విధమైన డబ్బు ను చెల్లించనక్కరలేదు; అంతేకాక, రోడ్డు ట్యాక్స్ లోనూ కొం
చెత్తనుంచి సంపద కు ఆస్కారం ఉండే సర్క్యులర్ ఇకానమి లో ఒక ముఖ్యమైన లంకె గా న్యూస్క్రాపింగ్ పాలిసీ ఉంది: ప్రధాన మంత్రి

గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. వాలంటరి వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేశన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలిసీ లో భాగం గా వెహికల్ స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడుల ను ఆహ్వానించడం కోసం ఈ శిఖర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక ఏకీకృతమైన స్క్రాపింగ్ హబ్ ను అభివృద్ధి పరచడం కోసం అలంగ్ లో గల శిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందిస్తున్నటువంటి అవకాశాల ను సైతం సమగ్రం గా వివరించనుంది. ఈ సందర్భం లో రోడ్డు రవాణా, హైవేస్ శాఖ కేంద్ర మంత్రి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.

ఈ రోజు న వెహికల్ స్క్రాపేజ్ పాలిసీ ని ప్రారంభించుకొంటూ ఉండవడం భారతదేశ అభివృద్ధి ప్రస్థానం లో ఒక ప్రముఖమైన మైలురాయి అని చెప్పాలి. గుజరాత్ లో వెహికిల్ స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం కోసం నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ సమిట్ అనేక నూతన అవకాశాల కు తలుపులను తెరుస్తున్నది. వెహికిల్ స్క్రాపింగ్ అనేది పనికి రాని వాహనాల ను, కాలుష్యాన్ని చిమ్మే వాహనాల ను పర్యావరణానికి మేలు చేసే పద్ధతి లో దశల వారీ గా తొలగించడానికి తోడ్పడుతుంది. పర్యావరణం పట్ల బాధ్యత తో మెలగుతూనే భాగస్వాములు అందరి కి లబ్ధి కలిగేలా ఒక లాభదాయకమైనటువంటి సర్క్యులర్ ఇకానమి ని సృష్టించాలి అన్నదే మన ధ్యేయం గా ఉంది అని కార్యక్రమం లో పాల్గొనడాని కన్నా ముందు ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో వివరించారు.

ప్రధాన మంత్రి ‘నేశనల్ ఆటో మొబైల్ స్క్రాపేజ్ పాలిసీ’ ని ప్రవేశపెడుతూ, ఈ విధానం న్యూ ఇండియా లో ప్రయాణ రంగానికి, ఆటో సెక్టరు కు ఒక కొత్త గుర్తింపు ను ఇవ్వనుందన్నారు. ఈ విధానం ఉపయుక్తం గా లేనటువంటి వాహనాల ను ఒక శాస్త్రీయమైన పద్ధతి లో రహదారుల మీది నుంచి తొలగించి, దేశం లో వాహనాలకు సరికొత్త రూపు రేఖల ను సంతరించడం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది అని ఆయన తెలిపారు. మొబిలిటీ లో ఆధునికత్వం ప్రయాణ భారాన్ని, రవాణా తాలూకు భారాన్ని తగ్గించడం ఒక్కటే కాకుండా ఆర్థిక అభివృద్ధి కి కూడాను సహాయకారి గా ఉంటుంది అని ఆయన అన్నారు. 21 వ శతాబ్ధి లో భారతదేశం లక్ష్యం క్లీన్, కంజెశన్ ఫ్రీ, కన్వీనియంట్ మొబిలిటీ అని ఆయన చెబుతూ, అది తక్షణ ఆవశ్యకత అని కూడా పేర్కొన్నారు.

 

సర్క్యులర్ ఇకానమి లో, వ్యర్థాల నుంచి సంపద ను సృష్టించాలన్న ప్రచార ఉద్యమం లో నూతన స్క్రాపింగ్ విధానం ఒక ముఖ్యమైన లంకె అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో నగర ప్రాంతాల లో కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ సత్వర అభివృద్ధి వైపు సాగిపోవాలన్న మన నిబద్ధత కు కూడా ఈ విధానం అద్దం పడుతూ ఉందని ఆయన అన్నారు. రియూస్, రీసైకిల్, రికవరీ సూత్రాన్ని అనుసరిస్తూ ఈ విధానం ఆటో సెక్టర్ లోను, లోహ రంగం లోను దేశం యొక్క ఆత్మనిర్భరత ను ప్రోత్సహిస్తుంది అని ఆయన చెప్పారు. ఈ విధానం 10 వేల కోట్ల రూపాయల కు పైగా సరికొత్త పెట్టుబడి ని రప్పించి, కోట్ల కొద్దీ కొలువుల ను కల్పిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకొన్న తరువాత 75వ సంత్సరం లోకి త్వరలోనే అడుగుపెట్టనుందని ప్రధాన మంత్రి నొక్కి చెబుతూ, ఆ తరువాతి 25 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాల లో వ్యాపారాన్ని నిర్వహించే తీరు లో, దైనందిన జీవనం లో అనేక మార్పు లు వస్తాయి అని ఆయన అన్నారు. ఈ పరివర్తన నడుమ మన పర్యావరణాన్ని, మన నేల ను, మన వనరుల ను, మన ముడి పదార్థాలను పరిరక్షించుకోవడం కూడా సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది అని ఆయన అన్నారు. మనం భవిష్యత్తు లో నూతన ఆవిష్కరణల పై, సాంకేతిక విజ్ఞానంపై కృషి చేయవచ్చని అయితే భూమాత నుంచి మనం అందుకొనే సంపద అనేది మాత్రం మన చేతుల లో లేని విషయం అని ఆయన అన్నారు.

 

ప్రస్తుతం భారతదేశం ఒక పక్క డీప్ ఓశన్ మిషన్ ద్వారా కొత్త కొత్త అవకాశాలను అన్వేషిస్తూనే, మరో పక్క ఒక సర్క్యులర్ ఇకానమి ని కూడా ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి ని నిలకడగా ఉండే విధం గాను, పర్యావరణానికి అనుకూలమైందిగాను మలచడానికే ఈ ప్రయాస అని కూడా ఆయన చెప్పారు.

 

శక్తి రంగం లో ఇంతవరకూ జరుగనటువంటి కృషి ని చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. పవన శక్తి, సౌరశక్తి రంగం లో ముందు వరుస లో నిలబడుతున్న దేశాల సరస న భారతదేశం తాను కూడా నిలబడింది అని ఆయన అన్నారు. చెత్త నుంచి సంపద ను సృష్టించడానికి ఉద్దేశించిన ఈ ప్రచార ఉద్యమాన్ని స్వచ్ఛత తో, ఆత్మ నిర్భరత తో ముడిపెట్టడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

ఈ విధానం ద్వారా సాధారణ ప్రజానీకం ఎంతగానో లబ్ధి ని పొందనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకటో ప్రయోజనం ఏమిటి అంటే అది పాత వాహనాన్ని తీసివేసినపుడు ఒక సర్టిఫికెట్ ను ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ ను పొందిన వారు ఎవరైనా, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే రిజిస్ట్రేశను కు ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అగత్యం ఉండదు. దీనితో పాటు ఆ వ్యక్తి కి రోడ్డు ట్యాక్స్ లో కొంత రాయితీ ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి వివరించారు. రెండో ప్రయోజనం ఏమిటి అంటే ఈ పద్ధతి లో పాత వాహనం తాలూకు నిర్వహణ వ్యయం, మరమ్మతు వ్యయం తో పాటు ఫ్యూయల్ ఎఫిశియెన్సీ పరంగా కూడాను ఎలాంటి భారం పడదు అని ఆయన చెప్పారు. మూడో లబ్ధి ఏకం గా జీవనానికి సంబంధించింది అని ఆయన అన్నారు. పాత వాహనాల వల్ల, పాత టెక్నాలజీ వల్ల చోటు చేసుకొనే రహదారి ప్రమాదాల తాలూకు అధిక నష్ట భయం బారిన పడకుండా ఉండవచ్చు అని ఆయన వివరించారు. నాలుగో ప్రయోజనం ఏమిటి అంటే అది ఈ విధానం మన ఆరోగ్యం పైన కాలుష్యం తాలూకు హానికారక ప్రభావాన్ని తగ్గిస్తుంది అని ఆయన అన్నారు.

 

కొత్త విధానం లో వాహనాల ను అవి ఎంత పాతవి అనే ఒకే ప్రాతిపదిక న తీసివేయడం జరుగదు అన్న వాస్తవాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. వాహనాల ను అధీకృత, ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ల ద్వారా శాస్త్రీయమైన పద్ధతి లో పరీక్షలకు లోను చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉపయుక్తం కాని వాహనాల ను శాస్త్రీయం గానే రద్దుపరచడం జరుగుతుందన్నారు. దీని ద్వారా దేశ వ్యాప్తం గా ఉన్నటువంటి నమోదైన వాహన రద్దు కేంద్రాలు, సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నడిచేవి గాను, పారదర్శకమైనవి గాను రూపొందేటట్లు గా జాగ్రత వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

 

స్క్రాప్ సంబంధి రంగాని కి నూతన శక్తి ని, భద్రత ను ఈ కొత్త విధానం ప్రసాదిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఉద్యోగులు మరియు చిన్న నవ పారిశ్రామికులు ఒక సురక్షిత వాతావరణాన్ని కలిగి ఉంటారని, ఇతర సంఘటిత రంగాల ఉద్యోగుల కు ఉండేటటువంటి ప్రయోజనాలనే వీరు కూడా అందుకొంటారని ఆయన అన్నారు. అధీకృత స్క్రాపింగ్ సెంటర్ లకు కలెక్శన్ ఏజెంట్ లుగా వీరు పని చేసేందుకు వీలు ఉంటుందని వెల్లడించారు. మన స్క్రాపింగ్ ప్రక్రియ ఫలవంతమైందిగా లేని కారణం గా కిందటి సంవత్సరం లో 23,000 కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్ స్టీల్ ను మనం దిగుమతి చేసుకోక తప్పని స్థితి ఎదురవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. మనం ఎనర్జీ, రేర్ అర్థ్ మెటల్స్ ను రికవర్ చేసుకోవడం లో నిస్సహాయులం అయ్యాం అని కూడా ఆయన అన్నారు.

 

ఆత్మ నిర్భర్ భారత్ ను సాకారం చేసే ప్రక్రియ ను వేగవంతం చేయడానికి భారతదేశ పారిశ్రామిక రంగాన్ని తగినట్లు గాను, ఫలప్రదమైందిగాను తీర్చిదిద్దేందుకు అదేపని గా చర్యల ను తీసుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఆటో మేన్యుఫ్యాక్చరింగ్ తాలూకు వేల్యూ చైన్ విషయం లో దిగుమతుల పైన ఆధారపడడాన్ని తగ్గించాలి అన్నదే మన ప్రయాస అని ఆయన స్పష్టం చేశారు.

 

ఇథెనాల్ కావచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ కావచ్చు, లేదా ఇలెక్ట్రిక్ మొబిలిటీ కావచ్చు.. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రాధాన్యాలను దృష్టి లో పెట్టుకొని పరిశ్రమ క్రియాశీలమైన రీతి లో భాగస్వామ్యాన్ని వహించడం చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డి) మొదలుకొని మౌలిక సదుపాయాల వరకు చూస్తే పరిశ్రమ తన వంతు భాగస్వామ్యాన్ని పెంచవలసి ఉంది అని ఆయన అన్నారు. రాబోయే 25 సంవత్సరాల కాలానికి గాను ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధన కోసం ఒక మార్గ సూచీ ని సిద్ధం చేద్దాం అని ఆయన కోరారు. దీని కోసం మీకు అవసరపడ్డ ఏవిధమైనటువంటి సహాయాన్ని అయినా సరే అందించడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉంది అంటూ ఆయన హామీ ని ఇచ్చారు.

 

ప్రస్తుతం దేశం క్లీన్, కంజెశన్ ఫ్రీ, మొబిలిటి దిశ లో పయనిస్తున్న కాలం లో పాత వైఖరి ని, పాత అభ్యాసాల ను మార్చుకోవలసిన ఆవశ్యకత ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. నేటి భారతదేశం తన పౌరుల కు ప్రపంచ శ్రేణి ప్రమాణాల తో కూడిన సురక్ష ను, నాణ్యత ను అందించడానికి కంకణం కట్టుకొందని, మరి బిఎస్-4 నుంచి బిస్6 కు మళ్లడం వెనుక ఉన్న ఆలోచన విధానం ఇదే అని ఆయన చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.