నేపాల్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ శేర్ బహాదుర్ దేవు బా ఆహ్వానించిన మీదట 2022వ సంవత్సరం మే 16వ తేదీ నాడు నేను నేపాల్ లోని లుంబినీ ని సందర్శించబోతున్నాను.
మంగళప్రదమైనటువంటి బుద్ధ పూర్ణిమ సందర్భం లో మాయాదేవి ఆలయం లో పూజాదికాలలో పాలుపంచుకోవాలని నేను ఉత్సాహపడుతున్నాను. లక్షల కొద్దీ భారతీయుల వలెనే భగవాన్ బుద్ధుని పవిత్ర జన్మస్థలం లో శ్రద్ధసుమాల ను అర్పించే అవకాశాన్ని పొంది నేను గౌరవాన్వితుడిని అయ్యానని తలుస్తున్నాను.
కిందటి నెల లో ప్రధాని శ్రీ దేవుబా భారతదేశాన్ని సందర్శించినప్పుడు మా మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిన తరువాత ఆయన తో మరొక్కసారి భేటీ అవ్వాలని ఆశపడుతున్నాను. మేం జలవిద్యుత్తు, అభివృద్ధి మరియు కనెక్టివిటీ లు సహా అనేక రంగాల లో సహకారాన్ని విస్తరింప జేసుకోవడం కోసం మా ఉమ్మడి అవగాహన ను పెంపొందించుకోవడాన్ని కొనసాగిస్తాం.
పవిత్రమైన మాయాదేవి ఆలయాన్ని సందర్శించడంతో పాటు గా, నేను లుంబినీ మఠ ప్రాంతం లో ఇంటర్ నేశనల్ సెంటర్ ఫార్ బుద్ధిస్ట్ కల్చర్ ఎండ్ హెరిటేజ్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం లో పాలుపంచుకొంటాను. అలాగే బుద్ధ జయంతి సందర్భం లో నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉత్సవాల లో కూడా నేను పాలుపంచుకొంటాను.
నేపాల్ తో మన సంబంధాలు సాటి లేనివి గా ఉన్నాయి. భారతదేశానికి, నేపాల్ కు మధ్య గల నాగరకతపరమైన సంబంధాలు మరియు ప్రజల మధ్య పరస్పర ఏర్పడ్డ సంబంధాలు మన సన్నిహిత బంధాని కి దృఢత్వాన్ని జతచేస్తున్నాయి. నా సందర్శన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది కాలంతో పాటే బలపడ్డ ఈ సంబంధాల ను వేడుక గా తలచుకొంటూ గాఢతరం గా మలచాలి అనేదే. ఈ సంబంధాల కు శతాబ్దాలు గా ప్రోత్సాహం లభించింది; అంతేకాదు, ఈ సంబంధాల కు మన పరస్పర సన్నిహితత్వం తాలూకు దీర్ఘ చరిత్ర లో స్థానాన్ని కూడా కల్పించడమైంది.