ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ ఆహ్వానించిన మీదట శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) యొక్క దేశాధినేతల మండలి తాలూకు 22వ సమావేశాని కి హాజరవడం కోసం ఈ రోజు న సాయంత్రం పూట ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ కు చేరుకొన్నారు.
ప్రధాన మంత్రి సమర్ కంద్ కు చేరుకోవడంతోనే ఉజ్ బెకిస్తాన్ ప్రధాని శ్రీ అబ్దుల్లా అరిపొవ్ ఆయన కు ఆప్యాయం గా ఆహ్వానం పలికారు. విమానాశ్రయం లో ప్రధాన మంత్రి కి స్వాగతం పలకడం కోసం పలువురు మంత్రులు, సమర్ కంద్ ప్రాంతం గవర్నరు మరియు ఉజ్ బెకిస్తాన్ ప్రభుత్వం లోని ఇతర సీనియర్ అధికారులు కూడా విమానాశ్రయాని కి తరలివచ్చారు.
ప్రధాన మంత్రి రేపు ఉదయం, అంటే 2022 సెప్టెంబర్ 16వ తేదీ నాడు ఎస్ సిఒ సమిట్ లో పాలుపంచుకోవడం తో పాటు గా ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుని తో మరియు శిఖర సమ్మేళనాని కి హాజరు అవుతున్నటువంటి నాయకుల లో కొందరు నేతల తో ద్వైపాక్షిక సమావేశాల లో కూడా పాల్గొంటారు.
Landed in Samarkand to take part in the SCO Summit. pic.twitter.com/xaZ0pkjHD1
— Narendra Modi (@narendramodi) September 15, 2022