ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో 14వ భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం కోసం 2022వ సంవత్సరం లో మార్చి నెల 19వ, 20వ తేదీల లో న్యూ ఢిల్లీ కి ఆధికారిక యాత్ర ను చేపట్టనున్నారు. ఈ శిఖర సమ్మేళనం ఇద్దరు నేత ల మధ్య జరిగే ఒకటో సమావేశం అవుతుంది. ఇంతకు మునుపు భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో అక్టోబరు నెల లో చోటు చేసుకొంది.
2. భారతదేశం మరియు జపాన్ వాటి ‘ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం’ పరిధి లో బహుముఖీనమైనటువంటి సహకారాన్ని కలిగివున్నాయి. ఈ శిఖర సమ్మేళనం ఇరు పక్షాల కు వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, ఆ సహకారాన్ని పటిష్టపరచుకోవడానికి, వీటితో పాటు గా ఉభయ దేశాల భాగస్వామ్యాన్ని ఇండో- పసిఫిక్ ప్రాంతం లోను, అంతకు మించిన స్థాయి లో సైతం శాంతి ని, సుస్థిరత్వాన్ని, సమృద్ధి ని పెంపొందింపచేసుకోవడం కోసం ముందుకు తీసుకుపోవడానికి, ఇంకా పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల గురించి, అంతర్జాతీయ అంశాల పట్ల ఒక పక్షం ఆలోచనల ను మరొక పక్షాని కి వెల్లడి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని అందించనుంది.