MyGov (మైగవ్) మాధ్యమం ప్రాతినిధ్యపూర్వకమై, సుపరిపాలన కు చైతన్యభరిత వేదిక గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మైగవ్ మాధ్యమం పది సంవత్సరాల కాలాన్ని ఈ రోజు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ మాధ్యమాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ఈ MyGov (మైగవ్) కు తమ బహుమూల్య అంతర్ దృష్టితో సూచనలు-సలహాల ను అందించి మెరుగులు దిద్దిన వారిని అందరిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, మనం #10YearsOfMyGov ను గుర్తుకు తెచ్చుకొంటున్నాం. ఈ మాధ్యమాన్ని తమ అమూల్యమైన అంతర్ దృష్టితోను, సూచనలు-సలహాలతోను సుసంపన్నం చేసిన వారినందరిని నేను అభినందిస్తున్నాను. గత దశాబ్ద కాలంలో, మైగవ్ ప్రాతినిధ్యపూర్వకమైన, సుపరిపాలన కు ఒక చైతన్యభరితమైన వేదిక గా ఎదిగింది.’’
Today, we mark #10YearsOfMyGov. I compliment all those who have enriched this platform and shared their valuable insights as well as inputs. Over the last decade, MyGov has emerged as a vibrant forum for participative and good governance.
— Narendra Modi (@narendramodi) July 26, 2024