ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రెంచి సాయుధ బలగాల మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్ పార్లే ఈ రోజు సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక రక్షణ సహకారంలో చోటు చేసుకొన్న పరిణామాలను గురించి ప్రధాన మంత్రి కి శ్రీమతి పార్లే ఈ సందర్భంగా వివరించారు. భారతదేశం మరియు ఫ్రాన్స్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలోని కీలకమైన స్తంభాలలో రక్షణ సంబంధ సహకారం ఒకటి అని ప్రధాన మంత్రి చెప్పారు. రక్షణ సంబంధ సామగ్రి తయారీ లోను, సంయుక్త పరిశోధనలు మరియు అభివృద్ధి లోను ‘మేక్ ఇన్ ఇండియా’ ఫ్రేమ్ వర్క్ పరంగా ఇతోధిక సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
పరస్పర ప్రయోజనాలు ముడిపడిన ప్రాంతీయ అంశాలను, ప్రపంచ స్థాయి అంశాలను కూడా ఉభయ నేతలూ చర్చించారు.
ప్రెసిడెంట్ శ్రీ మైక్రోన్ ఆయన వీలును బట్టి ఎంత త్వరగా భారతదేశానికి విచ్చేస్తారోనని తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.